దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈనెల 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేయాలని కేంద్ర కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. దేశం ఇంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికి, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ, లేబర్ కోడ్స్ అమలును దూకుడుగా ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు కార్మికుల పని గంటలను పెంచు తొందని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు అని అన్నారు.