శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈనెల 12 వ తేదీ ఉదయం 5: 30 గంటలకు గాజువాక డిపో ఆంజనేయస్వామి గుడి పక్కన ఉన్న శ్రీ స్వామి వివేకానంద విగ్రహం వద్ద నుంచి యూత్ మారథాన్ కార్యక్రమం పొలిమేర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద విగ్రహం దగ్గర నుంచి మల్కాపురం ఆంజనేయ స్వామి విగ్రహం వరకు అక్కడ నుంచి గాజువాక డిపో వరకు ఐదు కిలోమీటర్ల మేర రన్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.