గాజువాక 76వ వార్డు, ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ట్రాక్టర్ బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనలో ఒక విద్యుత్ స్తంభం పూర్తిగా ధ్వంసమైంది.