వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' పేరుతో గాజువాక నియోజకవర్గంలో ఆదివారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణదేవరాయలు జంక్షన్ (జగ్గు జంక్షన్) దగ్గర గల గాజువాక క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కె. కె రాజు పాల్గొన్నారు.