విశాఖ సెంట్రల్ జైల్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణల పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్ లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఖైదీల రక్షణే ముఖ్యమని పేర్కొన్నారు.