రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. జీవీఎంసీ 77వ వార్డు పరిధి పిట్టవానిపాలెం శివారు మరడదాసరిపేటకు చెందిన పాల ప్రసాద్ రెడ్డి అనే యువకుడు డిసెంబర్ 31వ తేదీన పాలవలస లోని తన అమ్మమ్మ ఇంటికి ద్విచక్రవాహహనంపై వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా మరడ దాసరిపేట రైల్వేగేటు సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కేజీ హెచ్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.