టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుటుంబాన్ని మంగళవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విశాఖ సీతంపేటలో నివాళులర్పించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.