కేంద్ర ఉక్కు మంత్రి హెచ్. డి. కుమారస్వామిని విశాఖ ఎంపీ శ్రీభరత్ గురువారం కలిశారు. విశాఖ ఉక్కు పరిరక్షణపై మంత్రితో కలిసి కీలక చర్చలు జరిపారు. ఉద్యోగుల వేతనాల సమస్యను మంత్రి దృష్టి కి తీసుకెళ్లారు. గత రెండు నెలల వేతనాలు అందక ఉద్యోగులు పడుతున్న సమస్యలను మంత్రికి వివరించారు. తొందర్లోనే స్టీల్ ప్లాంట్లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.