గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో వడ్లపూడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోది సభకు బుధవారం ప్రజలు భారీగా తరలివెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కు విచ్చేస్తున్న ప్రధానికి ఘనస్వాగతం పలకాలని, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ ప్రజలను కోరారు.