గాజువాక సీకువానిపాలెంలోని వర్షాలకు కొన్ని వీధులు ముంపు సమస్యకు పరిష్కారం లభించింది. ఈ నేపథ్యంలో 75వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపి అద్యక్షులు పల్లా శ్రీనివాస రావు సహకారoతో సుమారు రూ.50 లక్షలనిధులు మంజూరు చేశారు. దీంతో శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు