విశాఖపట్నంలోని గాజువాక పంతులు గారి మేడ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో సెల్ఫ్ యాక్సిడెంట్ కారణంగా డ్రైవర్ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.