గాజువాక సమీపంలోని నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ పోల్ ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. కే. కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.