వైసీపీ అధినేత జగన్‌కు షాక్ తగిలింది. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పార్టీని వీడారు. త్వరలో ఆయన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. అయితే మొదట ఆయన టీడీపీలో చేరుతారని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత జనసేనలో చేరబోతున్నట్లు వంశీరెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.