విశాఖ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేశాడు. ఈ ప్రమాదంలో దుర్గారావు, సుష్మిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.