విశాఖ: బీహెచ్ఈఎల్ సూపర్వైజర్ ట్రైనీ ఎగ్జామ్ పేపర్ లీక్

78చూసినవారు
విశాఖ: బీహెచ్ఈఎల్ సూపర్వైజర్ ట్రైనీ ఎగ్జామ్ పేపర్ లీక్
విశాఖపట్నం నగరం పెందుర్తి పరిధిలో ఉన్న జియాన్ సెంటర్లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన బీహెచ్ఈఎల్ సూపర్వైజర్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పేపర్ లీక్ అవడానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. విద్యార్థులు మాత్రం సెంటర్ యాజమాన్యం పాత్ర ఉన్నట్టు చెబుతున్నారు. పోలీసులు దీనిపై విచారణ జరిపి పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. విద్యార్థులు మాత్రం ఎగ్జామ్స్ సెంటర్ బయట ధర్నా చేస్తూ మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారని, ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్