మల్కాపురం స్టేషన్ పరిధిలోని క్రాంతి నగర్, లైట్ హౌస్ ప్రాంతాల్లో ఒక మహిళ, ఓ వృద్ధుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లో సీఐ గొలగాని అప్పారావు పర్యవేక్షణలో పోలీసులు ఇద్దరినీ వేరే వేరు ప్రాంతాల్లో గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. మంచి పనితీరు కనబర్చిన సిబ్బందిని సీఐ శనివారం అభినందించారు.