విశాఖ: వీఎంఆర్డీఏ పనుల పురోగతి పరిశీలన

72చూసినవారు
విశాఖ: వీఎంఆర్డీఏ పనుల పురోగతి పరిశీలన
గాజువాక నియోజకవర‍్గంలోని పెదగంట్యాడలో క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం పనులను సత్వరం పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కె. ఎస్. విశ్వనాథన్ గురువారం ఆదేశించారు. అనంతరం కోడూరు-2, నంగినారపాడు, కుంచంగి-1లో రోడ్లు, కాలువల పనుల పురోగతిని సమీక్షించారు. తుంపాల కన్వెన్షన్ సెంటర్, రావు గోపాలరావు ఆడిటోరియంలో జోనల్ కార్యాలయ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్