విశాఖలోని షీలానగర్ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో శనివారం తోమాల సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయమే స్వామివారికి సుప్రభాత సేవతో మేలుకోలిపి, విశేష కైంకర్యాలు చేశారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ ఆలయం చుట్టూ తులసి, మల్లె, సంపంగి పుష్పమాలతో ప్రదక్షిణ చేసి, ఆ మాలలను అర్చకులకు సమర్పించారు. అనంతరం స్వామికి అలంకరించి నక్షత్ర హారతులు ఇచ్చారు.