అక్రమంగా గంజాయి కలిగి ఉన్న కేసులో విశాఖపట్నం జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి శుక్రవారం కీలక తీర్పు వెలువరించారు. నర్సీపట్నంకు చెందిన తుమ్మల వెంకటేశ్వర్ రావుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10, 000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.