మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 57. 4% ఉత్తీర్ణులయ్యారు. శనివారం ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్ శిరీష రాణి ఇంటర్ ఫలితాలు వివరాలు తెలియజేశారు. సెకండియర్లో మొత్తం 214 మంది విద్యార్థులు పరీక్షలకి హాజరుకాగా వారిలో 123 మంది ఉత్తీర్ణులై 57. 4% ఫలితాలు సాధించారు. అలాగే మొదటి సంవత్సరంలో 218 మంది విద్యార్థులు హాజరు కాగా 99 మంది ఉత్తీర్ణులయ్యారు.