మాడుగుల మండలంలో డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం చురుకుగా సాగింది. వర్షం పడుతున్నప్పటికీ కూడా ఉదయం నుంచి ఎండిఓకే అప్పారావుతోపాటు సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో వీధి వీధినా తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. మాడుగుల మండలంలో మొత్తం ఐదు కోట్ల ఏడు లక్షల 31 వేల 500 రూపాయలు 11674 మంది పెన్షనర్లకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.