మాడుగుల పశు వైద్య శాల పరిధిలోని మాడుగుల, చీడికాడ మండలాలలోని అన్ని గ్రామాలలో సోమవారం నుండి జూలై 14 వరకు పశు గ్రాస వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డా. వి చిట్టి నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశు వైద్య సిబ్బంది పాడి రైతులకు సబ్సిడీ ఫై పశు గ్రాస విత్తనాలు పంపిణీ చేసి, మేలైన పశు గ్రాసాలు సాగు చేయడం వలన కలిగే లాభాలు వివరిస్తారు.