మాడుగుల: కేజే పురంలో ఘనంగా బాలాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం

73చూసినవారు
మాడుగుల: కేజే పురంలో ఘనంగా బాలాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం
మాడుగుల మండలం కే జే పురం గ్రామంలో శనివారం శ్రీ బాలాంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవము ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో భక్తులతో శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ జండాలు చేత పట్టుకొని జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్