గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం చీడికాడ మండలం వీరభద్రపేట, సిరిజం పంచాయతీ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల గొప్పూరు కొన్నంపూడి గదబురు ప్రాంతాల్లో పోస్టల్ విడుదల చేశారు. బకాయిలు చెల్లించండి, తిండి అయిన పెట్టండి అంటూ నినాదాలు చేశారు. మండలంలో సుమారు కోటి రూపాయలు వరకు బకాయిలు ఉన్నాయనీ వెంటనే చెల్లించాలని కోరారు.