ప్రకృతి వ్యవసయంలో నవధాన్యాలు సాగుపై ఆదివారం మాడుగులలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులందరికీ తొలకరి వర్షాలు పడే ముందు నవధాన్యాలు 30 రకాల విత్తనాలు ఎకరానికి 12 కేజీలు చొప్పున వేయించడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది 30 రకాల విత్తనాలు సేకరించి తయారీ కోసం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎన్ఎఫ్ఏ డివిజన్ ఇంచార్జి నాగమణి ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల ప్రాధాన్యత వివరించారు.