తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు బుధవారం రైవాడ అతిథి గృహం వద్ద టిడిపి నియోజకవర్గ పరిశీలకులు ఏసుదాసు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులుగా పెద్దాడ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా దొగ్గ దేముడు నాయుడు, ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన పెద్దాడ వెంకటరమణ, దొగ్గ దేముడు నాయుడును ఘనంగా సత్కరించారు.