అరోహన్ ట్రైబల్ సొసైటీ వారు బుధవారం మాడుగుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకులు సురేఖా పట్నాయక్, ప్రసాద్ పట్నాయక్ తరుపున సంస్థ ప్రతినిధి బట్టా బాబురావు పిల్లలందరికీ సరిపడే నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరిపిల్లీ సూర్యనారాయణ. ఎస్ఎంసి చైర్మన్ పుట్టా కొండలరావు సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.