ఆషాడ మాసం లో వచ్చే ఏకాదశి నీ తొలి ఏకాదశిగా జరుపుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. శ్రీ జగన్నాథ స్వామి వారి రథోత్సవంలో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి మాడుగుల శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకుని కల్కి అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామివారిని భక్తులు దర్శించుకునీ తీర్థ ప్రసాద స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.