మాడుగుల శివారు చాకిరేవు వద్ద గల గండి చిన్న పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్చల్ చేసింది. పొలం యజమాని గోలెం కింద ఉన్న పామును చూసి భయపడి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్ వెంకటేష్ అక్కడికి చేరుకొని చాకచక్యంగా ఆ గిరినాగుని బంధించి దూరంగా గల అడవిలో విడిచిపెట్టారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పామును చూడలేదన్నారు. చూసిన వారంతా భయాందోళనకు గురయ్యారు. కాగా స్నేక్ క్యాచర్ ను పలువురు అభినందించారు.