వడ్డాది గ్రామ పంచాయితీ 10, 11 వార్డ్ సభ్యులైన బేరా రామలక్ష్మి, బొంది కృష్ణ , వైఎస్ఆర్ పార్టీ నుండి జనసేన పార్టీ లోకి ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు సమక్షంలో శనివారం రాత్రి చేరారు. ఈ కార్యక్రమంలో వడ్డాది గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ దాడి శెట్టి సూరి నాగేశ్వరరావు, మాజీ సొసైటీ చైర్మన్ దొండా సన్యాసిరావు, నాయకులు వీర్ల సురేష్, కుబ్బిన వెంకటరావు, షేక్ రసూల్ , దొండా సాయి మండల అధ్యక్షులు డి ఎస్ నాయుడు, పాల్గొన్నారు.