సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కింతలి వల్లాపురం పంచాయితీ తాలూకా వెలంపాడు గ్రామ మహిళలు శనివారం కోరారు. తమ గ్రామ పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు, జూదం వంటి క్రీడలు నిర్వహిస్తే స్వయంగా తామే పోలీసు వారికి కంప్లెయింట్ ఇస్తామన్నారు. అయితే ఇప్పటికే ఈ పండగ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ తుహిన్ సింహా ఆదేశాలతో పోలీసుల నిఘా ఉంది.