పెదబయలు మండలం మల్లెపుట్టులో శుక్రవారం ఉపాధి హామీ పథకం శ్రామికులు పని ప్రదేశంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్ర సహాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని అన్నారు. జూన్ 21వ తేదీ వరకు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో శ్రామికులు యోగాసనాలు చేయాలని సూచించారు.