రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినసందర్భంగా గురువారం మాడుగుల దేవిఆడిటోరియంలో కూటమి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు కూటమి నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఏడాది పాలన విజయాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.