మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరాపల్లి మండలం బోయిల కింతాడ గ్రామ సచివాలయాన్నిమాడుగుల నియోజకవర్గ ప్రత్యేక అధికారి, అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు బి. మోహన్ రావు గురువారం ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. సచివాలయంలో ప్రజలకు ప్రభుత్వం నుండి అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవలు గురుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయం సిబ్బందితో మాట్లాడి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.