మాడుగుల బస్టాండ్ ఆవరణలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉపసర్పంచ్ జే వరహాలు, బిజెపి నాయకులు పుట్ట గంగయ్య, తెలుగుదేశం నాయకులు రంజిత్ వర్మ తదితరులు పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు.