మాడుగుల; ఘనంగా బీజేపీ దీపోత్సవ కార్యక్రమం

68చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని బీజేపీ దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం మాడుగులలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద , అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద బీజేపీ, కూటమి నాయకులు దీపాలు వెలిగించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జోహార్లు అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్