జీవో నెంబర్ 36 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పిఎస్సిఎస్, ఉద్యోగులు విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణలో ఆందోళన చేపట్టినట్టు సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి జి రమణ శుక్రవారం సాయంత్రం తెలిపారు. 2019లో ఇచ్చిన జీవో నెంబర్ 36 ను తక్షణం అమలు చేయాలని ముఖ్యమైన డిమాండ్ తో పాటు, పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.