మాడుగుల: స్కూల్ కాంప్లెక్స్ శిక్షణకు హాజరైన డీఈవో

82చూసినవారు
మాడుగుల: స్కూల్ కాంప్లెక్స్ శిక్షణకు హాజరైన డీఈవో
స్కూల్ కాంప్లెక్స్ శిక్షణా తరగతులను ఉపాద్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు సూచించారు. బుధవారం ఆయన మాడుగుల బాలుర జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ శిక్షణా తరగతులను స్వయంగా పర్యవేక్షించారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకూ ఈ తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులకు తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్