మాడుగుల: ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కుటుంబ సమ్మేళనం

74చూసినవారు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యం లో మంగళవారం రాత్రి మాడుగుల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కుటుంబ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. మాడుగుల, చీడికాడ మండలాల నుండి పెద్ద ఎత్తున సంఘ అభిమానులు హిందూ బంధువులు కుటుంబాలతో హాజరయ్యారు. ప్రధాన వక్త గా ఆర్ఎస్ఎస్ ప్రాంత సహా కార్యవాహ ఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్తు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్