మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరాపల్లి మండలం తెనుగుపూడి శివారు గొల్లపేట గ్రామంలో బుధవారం జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు తదితరులు పాల్గొన్నారు.