రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలు సోమవారం మాడుగుల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నవసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి అంటు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.