మాడుగుల: ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

67చూసినవారు
మాడుగుల: ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
ధనుర్మాసంలో అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారం మాడుగుల నియోజకవర్గంలో వైష్ణవలయాల్లో ఘనంగా నిర్వహించారు. మాడుగులలో గల వెంకటేశ్వర స్వామి, పార్థసారథి స్వామి, సీతారామస్వామి, వేణుగోపాలస్వామి, జగన్నాథ స్వామి ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వారాలు ద్వారా భగవంతుని దర్శించుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్