రాయిపాలెం గ్రామంకి చెందిన పంది అప్పారావు రెండో కుమార్తె గత 15 రోజుల నుండి మలేరియా టైఫాయిడ్ తో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్ లో చేర్పించారు. అన్ని పరీక్షలు నిర్వహించగా ఒక కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. సంబంధిత గ్రూపుల్లో బాధితురాలు వివరాలు పంపించగా మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ స్పందించి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారిని కలిశారు. ఎలాంటి సమస్యకైనా తమను సంప్రదించాలని తల్లితండ్రులను భరోసా ఇచ్చారు.