ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ గవర్ననెన్స్ లో ప్రతి ఒక్కరు చేరి మీకు కావలసిన సేవలు నేరుగా పొందాలని ఎండిఓకే అప్పారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ మొబైల్ ఫోన్లో మన మిత్ర వాట్సప్ నెంబర్ 95523 00009 నెంబర్ను నమోదు చేసుకోవాలన్నారు. దీని ద్వారా మనకు కావలసిన ప్రభుత్వ సేవలను నేరుగా పొందవచ్చు అన్నారు. దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.