ఈనెల ఎనిమిదో తేదీ వరకు జరిగిన రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక తహసిల్దార్ కే రమాదేవి శుక్రవారం తెలిపారు. ఈ సదస్సులో 200 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని వాటిలో కొన్నింటిని పరిష్కరించామని మరికొన్నింటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. అలాగే రిజర్వ్ సదస్సులో కూడా 700 వరకు ప్రజలు వచ్చారని వాటిని కూడా పరిష్కరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.