ఒక మనిషి జీవితం కాపాడటంలోనూ అత్యవసర పరిస్థితుల్లో అతనికి అండగా నిలవడంలోనూ రక్తదాత స్ఫూర్తి ఎంతో అవసరం. స్వచ్ఛందంగా రక్తదానం చేయడం మానవాళికి సేవ చేయడమే. అలాంటి రక్త దాతలు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారే 63సార్లు రక్త దానం చేసిన మాడుగులకు చెందిన పుట్టా రామకృష్ణ. శుక్రవారం రక్త దాతల దినోత్సవం సందర్భంగా ఆయనను పలువురు అభినందిస్తున్నారు. ప్రతియువకుడు ఏడాదికి రెండుసార్లు రక్తదానం చేయాలంటున్నారు.