ఏప్రిల్ 30న జరిగిన పాలీసెట్ పరీక్ష ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో మాడుగుల వీనస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో25 మంది విద్యార్దులు ప్రతిభ కనుబరిచారని కరస్పాండెంట్ తాళ్ళపురెడ్డి నాగచంద్ర తెలిపారు. కిలపర్తి కేశవ 120 కి 114 మార్కులు పొంది మాడుగుల నియోజకవర్గంలో మొదటి స్థానం సంపాదించాడు. సాలది తులసి 111 మార్కులు తో ద్వితీయ స్థానం, పొలమరిశెట్టి జయశ్రీ 109 మార్కులుతో తృతీయ స్థానం పొందారు.