రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గం కేంద్రాల్లో నూతనంగా ప్రారంభించిన విజన్ 2047 కేంద్రాల ద్వారా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే అన్ని రకాల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. సోమవారం మాడుగులలో నియోజకవర్గ విజన్ కార్యాలయాన్ని నియోజవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు.