చీడికాడ మండలం శిరిజాం పంచాయితీ ఎల్ ఎన్ పురం గ్రామంలో జై శ్రీ పవర్ లూమ్స్ ఇండస్ట్రీ కి మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఇండస్ట్రీ ద్వారా పలువురికి ఉద్యోగ కోసం లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు ఎన్డీఏ కూటమి మండల నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.