ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా బుధవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. సిడిపిఓ సిహెచ్ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకున్ననాడు మంచి ఆరోగ్యం చేకూరగలదని చెప్పారు. ఈ సందర్భంగా పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించారు.